గుండె దడ

Posted: June 22, 2010 in love, poetry, telugu, Uncategorized

నీ పెదవంచున దొర్లేటి ఆ ఆణిముత్యాలు,
చిరుగాలికి నాట్యమాడు నీ పసిడి ముంగుర్లు,
లేత దానిమ్మ గింజల్లాంటి నీ పంటి వరుస,
నీ చెవుల ఊయలలూగు బంగారు లొలాకులు,
పసిడికే ప్రణంపోయు నీ మేని ఛాయ,
సప్తస్వరాలొలికించెడి నీ కంఠ మాధుర్యం,
నీ నగవున నాట్యమడేటి ఆ సౌందర్య దేవత.

ఏ తారను త్రుంచి తెచ్చావమ్మ నీ నుదిటి చుక్కకై?
ఏ శిల్పి ఉలి మలిచెనమ్మ నీ నాశికమ్మును!
ఏ కవికి తరమగు స్తొత్రాలీయ నీ నేత్రాలకే?
నీ కురులలలోని జలపతాలా మల్లెమొగ్గలా?
నీ వీనుల వంపును దోచితెచ్చితివ ఎల్లోర శిల్పాలనుంచి?
ఛంద్రుడిపై జాలితోటి చేర్చితివా ఆ మచ్చ నీ బుగ్గపైన?
నీ కనురెప్పలు పలికెడిది సొబగుల సోయగాల భాషలోనా?

నీ గోటిరంగు నందె దాచియుంచినావె ఉదయభానుని సప్తవర్ణాలను
నయనాలతోనె నర్తించుచున్నావె మత్స్య కన్యక,
నీ చెంత చేరు భాగ్యమొందిన యతగాడిపై నా ఈర్ష్య న్యాయమేనె కథానాయిక

ముంగురుల సవరించెడి నీ మునివేళ్ళ  అందాలనేమని వర్ణించెదనె , మురిపాల నెరజాణ,
నీ చిరుపాదాల దర్శనమీయవె చినదాన.
నీ మోమైన కనులార కాంచెడి వరమీయవె వయ్యారి.

నీవు చిరునవ్వులొలికించునపుడు నీ లేత చిగురులజూసి చిగురించె మోహం నా హృదయాన,
ఎచ్హోటికేగుచున్నావె, నిను వీడనంటోంది నా హృదయ స్పందన,
దొరికిపోతి నీకు నా దొంగచూపుల వైనాన,
ఆమోదముదెల్పుతు నీ శిరమూగెడి ఆ చందమే అందమా?

నీచేతిలోన చేయివేసి ఊసులెన్నొబోవుచున్న యా భాగ్యశాలి భాగ్యమేమి?

ఏ జన్మకు నే ధన్యుడునగు భాగ్యము దొరుకునె నీ దరిచేరి
నీ చున్నీ చేసెడి చమత్కారమంతనా ఇంతనా నా పైన
దయ చూపవే కొంతైన తీర్పగ ఈ దీనుని హృదయ వేదన

Dedicated to my dear wife,

Who is the breath of my life.

Advertisements

What do you think?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s