నీ కనుల దోబూచులాట నా ఈ పాట

Posted: February 19, 2011 in love, poetry, telugu
Tags: ,

నీ కనుల దోబూచులాట నా ఈ పాట
రెపరెపలాడెడి నీ కనురెప్పలు తెలిపెడి సంకేతమేమిటట?
పదే పదే నాపై సోకుచున్న నీ వాలుచూపుల వయనమెందుకట?
సమ్మోహనాస్త్రముల సంధించెడి మన్మధ విల్లులే నీ కనుబొమలాయెనట.

చిద్విలాసముల చిందించెడి నీ నగుమోము గాంచి చిన్నబోయెనా చందమామ
నీ ప్రతి నవ్వులోన దొర్లుచున్నవి నవరత్న రాశులెన్నో
పరిహాసములు పోవుటెందులకె పలుమార్లు నను జూసి?
నీ పెదవులపై పదములనై నే నిను జేరెద త్వరలోన
నీ అందియల సవ్వడినై వినిపిస్తా నీ ప్రతి అడుగులోన
వయ్యారి, నీ తోడుంటా నువు నడుమూపుతు నడిచే ప్రతి నడకలోన
[Enchanting Eyes]

Advertisements

What do you think?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s